Chilukuru Balaji Temple: చిలుకూరి ఆలయం విషయంలో అది ఫేక్ వీడియో:ప్రధాన అర్చకులు రంగరాజన్

by Prasad Jukanti |
Chilukuru Balaji Temple: చిలుకూరి ఆలయం విషయంలో అది ఫేక్ వీడియో:ప్రధాన అర్చకులు రంగరాజన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిలుకూరు బాలాజీ టెంపుల్ లో 'వివాహ ప్రాప్తి' కార్యక్రమం కొనసాగుతున్నదని ప్రతినెల కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది ఏప్రిలో 21వ తేదీనే స్వామి వారి వివాహ మహోత్సవం నిర్వహించాం. ఈ కార్యక్రమం పూర్తి అయిపోనప్పటికీ కొంతమంది పాత వీడియోలో ఏప్రిల్ నెలను తొలగించి 21వ తేదీన స్వామి వారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది అంటూ ప్రతి నెల ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల భక్తులను అయోమయానికి గురి చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ తాజాగా ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. కాగా ఈ ఏడాది జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరుడ ప్రసాద వితరణ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాటతో పాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో ఆ సమయంలో జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేశారు. కల్యాణ మహోత్సవం కోసం ఆలయానికి ఎవరూ రావొద్దని వివాహ ప్రాప్తి కోసం భక్తులు ఇంటి వద్ద స్వామివారిని ప్రార్థించుకోవాలని రంగరాజన్ గతంలో ప్రకటించారు. అయితే భక్తుల నమ్మకాన్ని ఆసరగా చేసుకుని కొంత మంది ప్రతి నెల 21వ తేదీకి సరిగ్గా ఐదారు రోజుల ముందు నుంచి ఈ కార్యక్రమం జరగబోతున్నదని ప్రచారం చేస్తుండటంతో చాలా మంది భక్తులు 21వ తేదీ రాగానే ఆలయానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు వంటి చర్యలు మానుకోవాలని రంగరాజన్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed