- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్ లో నఖిలీ డాక్టర్ గుట్టురట్టు!.. ఎంబీబీఎస్ పేరుతో వైద్యసేవలు
దిశ, డైనమిక్ బ్యూరో: వైద్యుడిని అని చెప్పుకుంటూ అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తు్న్న నఖిలీ డాక్టర్ గుట్టు రట్టయ్యింది. సికింద్రాబాద్ లో వాయు క్లినిక్ పేరుతో వైద్యసేవలు అందిస్తున్న నఖిలీ డాక్టర్ ను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పట్టుకున్నారు. పుల్లగుర్ల వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి హాస్పిటల్ లో పని చేసిన అనుభవంతో ఎంబీబీఎస్ అని మాయమాటలు చెప్పి క్లినిక్ మొదలుపెట్టాడు. తనకు తెలిసిన వైద్యంతో స్థానికులకు వైద్యసేవలు అందిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడి చేయగా.. నకిలీ రిజిష్ట్రేషన్ నంబర్లతో కూడిన స్టాంపులు, ప్రిస్క్రిప్షన్ పుస్తకాలను కనుగొన్నారు.
అలాగే క్లినిక్ లో అక్రమంగా అమ్మకానికి ఉంచిన 1.60 లక్షల విలువ చేసే మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మందుల్లో భారతీయ రైల్వే సరఫరాల కోసం ఉద్దేశించిన మందులతో పాటు ప్రాణానికి ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ కూడా ఉన్నాయని అధికారులు గుర్తించారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆ క్లినిక్ ను సీజ్ చేయడంతో పాటు ప్రజలను మోసం చేస్తున్న ఆ నకిలీ డాక్టర్ పై తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.