- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనియా తెలంగాణ ఇచ్చిందని బూటకపు ప్రచారం.. ఎర్రోళ్ల సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సోనియా తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు బూటకపు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1969 ఉద్యమం లో 369 మంది ని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకోలేదా? అన్నారు. ఆ ఉద్యమంలో అమరులకు గుర్తుగానే గన్ పార్కు దగ్గర స్థూపం కట్టారన్నారు. మలి దశ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది విద్యార్థులను యువకులను బలి తీసుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ చరిత్ర అంతా మోసం, దగా అన్నారు. తామే తెలంగాణ తెచ్చామని కాంగ్రెస్ అనడం దయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుందన్నారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టి పోరాడకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు.
నీలం సంజీవ రెడ్డి నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాంగ్రెస్‌ది ద్రోహుల చరిత్రే అన్నారు. కాంగ్రెస్ ఉత్సవాలు జరపడం అంటే హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. .ఏనాడూ జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నాడని తెలిపారు. ఈ ఆరు నెలల్లో సీఎం రేవంత్ ఏనాడూ తెలంగాణ అమర వీరుల స్థూపం దగ్గరకు వెళ్ళలేదని గుర్తు చేశారు. తెలంగాణ ద్రోహుల చేతుల్లోకి రాష్ట్రం వెళ్లిందన్నారు. ఉస్మానియాలో బలిదానాలు చేసుకున్న వారు తెలంగాణ పట్ల కాంగ్రెస్ అలసత్వం కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తమ లేఖల్లో రాయలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది.. తెలంగాణ కోసం నిలబడేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. తెలంగాణ చిహ్నాన్ని మారుస్తారేమో కానీ కేసీఆర్‌తో తెలంగాణకున్న స్నేహాన్ని మార్చలేరన్నారు. బీ ఆర్ ఎస్ ఆద్వర్యం లో జరిగే మూడు రోజుల ఉత్సవాలను తెలంగాణ వాదులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మిలియన్ మార్చ్ తరహాలో కదిలొచ్చి క్యాండిల్ ర్యాలీలో పాల్గొనాలన్నారు.