- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ విస్తరణ.. కో ఆర్డినేటర్లను ప్రకటించిన కేసీఆర్
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని చూస్తున్న బీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకలాపాల బాధ్యతలను పలువురికి అప్పగించే పనిని స్పీడప్ చేశారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా హిమాన్షు తివారీని నియమిస్తూ బుధవారం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో పాటు మహారాష్ట్రలో పలు డివిజన్లకు రీజినల్ కోఆర్డినేటర్లను ప్రకటించారు. బీఆర్ఎస్ నాసిక్ డివిజన్ కో ఆర్డినేటర్‌గా దశరథ్ సావంత్, పూణె డివిజన్‌కు బాలసాహెబ్ జైరామ్ దేశ్ ముఖ్, ముంబై డివిజన్‌కు విజయ్ తాంజీ మోహితే, ఔరంగాబాద్ డివిజన్ కు సోమ్ నాథ్, నాగ్ పూర్ డివిజన్‌కు ద్యానేష్ వకుద్కర్, అమరావతి డివిజన్ కో ఆర్డినేటర్‌గా నిఖిల్ దేశ్ ముఖ్ పేర్లను ఖరారు చేశారు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బరిలోకి దింపేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆరు డివిజన్లకు కోఆర్డినేటర్లను నియమించడం హాట్ టాపిక్‌గా మారింది.