- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సభ వాయిదా వేసుకుని పారిపోయారు’.. ప్రభుత్వంపై హరీష్ రావు ధ్వజం
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టించిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శనివారం అసెంబ్లీ బడ్జెట్‌పై సాధారణ చర్చ అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడుతూ.. సభలో ప్రధాన పక్షంగా తమ గొంతు వినిపించేందుకు మైక్ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తమ క్లారిఫికేషన్ తీసుకోకుండానే సభను వాయిదా వేసుకుని పారిపోయారని ఎద్దేవా చేశారు.
మోటార్లు మీటర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే మోటర్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. కాగా, ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తుటాలు పేలాయి. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించగా.. బీఆర్ఎస్ తరుఫున మాజీ మంత్రి హరీష్ రావు సమర్ధవంతంగా కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఇరు వర్గాల విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్లు, రీ కౌంటర్లతో అసెంబ్లీ హాల్ దద్దరిల్లింది.