- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ మాజీ CS సోమేశ్‌కు బిగుస్తున్న ఉచ్చు.. పక్కా ప్లాన్ ప్రకారమే భూమి కొనుగోలు!
దిశ, వెబ్‌డెస్క్: భూమి కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. పక్కా ప్లాన్ ప్రకారమే రంగారెడ్డి జిల్లా యాచారంలో ఆయన భూములు కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మాసిటీ అక్కడకు వస్తుందని ముందే తెలిసుకొని 2018లో ఆయన అక్కడ భూములు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం నలుగురి వద్ద 25 ఎకరాల భూమిని సోమేశ్ కుమార్ కొనుగోలు చేశారు. ఒక్కో ఎకరానికి కేవలం రూ.2 లక్షలు మాత్రమే వెచ్చించి విలువైన భూమిని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ ధరకే భూములు దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ అనమానం వ్యక్తం చేస్తోంది. కాగా, సోమేశ్ కుమార్ తన భార్య పేరు మీద ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే.
ఒక్కో ఎకరం రూ.3 కోట్లు పలికే ఆ ప్రాంతంలో రూ.2 లక్షలకు దక్కించుకున్నప్పుడే అనుమానాలు రావాల్సి ఉందని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మరోవైపు తాను నిబంధనల ప్రకారమే భూమిని కొనుగోలు చేశానని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అలాట్ చేసిన నివాస స్థలంలో నిర్మించుకున్న గృహాన్ని విక్రయించి కొత్తపల్లి గ్రామంలో ఆరేళ్ల కిందనే ఈ వ్యవసాయ భూమిని కొనుగోలు చేశానని వెల్లడించారు. నాటి ప్రభుత్వం భూమి కొనుగోలుకు అనుమతి కూడా ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఏసీబీ సమగ్ర విచారణ తర్వాత అసలు నిజాలు వెలువడనున్నాయి.