నేను తెలుగు బిడ్డను, తెలుగులోనే మాట్లాడుతా.. ఎంఐఎం ఎమ్మెల్యేకు మంత్రి సీతక్క కౌంటర్

by Ramesh Goud |   ( Updated:2025-03-26 16:09:47.0  )
నేను తెలుగు బిడ్డను, తెలుగులోనే మాట్లాడుతా.. ఎంఐఎం ఎమ్మెల్యేకు మంత్రి సీతక్క కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఆయా శాఖల పద్దులపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ సందర్భంగా శాసన సభలో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు (Criticises) చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భాష (Language) వల్ల తనకు ఇబ్బంది కలుగుతుందని ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (AIMIM MLA Akbaruddin Owisi) చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క (Minister Seethakka) స్ట్రాంగ్ కౌంటర్ (Strong Counter) ఇచ్చారు.

సభలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. మంత్రికి నేను చెప్పేది అర్థం కాలేదని, ఆమెకు నా ఇంగ్లీష్ (English), నా ఉర్థూ (Urdhu) రెండూ అర్థం కావట్లేదు.. ఆమె తెలుగు నాకు అర్థం కావట్లేదు నేనేం చేయాలి అని వ్యాఖ్యానించారు. దీనికి మంత్రి సీతక్క స్పందిస్తూ.. వాళ్లు పదేళ్లలో ఒక్క ఇళ్లు కూడా కట్టలేదు.. ఇవ్వలేదు అని చెప్పానని, దానికి మీకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అంటున్నారని మండిపడ్డారు. అలాగే నా మాతృ భాష తెలుగు (Telugu) అని, అందుకే నేను ఇంగ్లీష్, హిందీ భాషలలో మాట్లాడలేనని చెప్పారు. అంతేగాక తాను తెలుగులో పుట్టానని, ఎక్కడో గూడెంలో పుట్టానని అందుకే తాను అర్థం చేసుకోలేనని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Next Story

Most Viewed