కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఉత్కంఠ.. రేపు గులాబీ బాస్ టార్గెట్ బీఆర్ఎస్? బీజేపీ?

by Prasad Jukanti |
కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఉత్కంఠ.. రేపు గులాబీ బాస్ టార్గెట్ బీఆర్ఎస్? బీజేపీ?
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. మెజారిటీ లోక్ సభ స్థానాలను గెలుచుకునేందుకు ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతుండగా రేపటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్తుండటం ఆసక్తిగా మారుతున్నది. ఆదివారం నుంచి మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించబోతున్నారు. రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించి రైతులను పరామర్శించనున్నారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాల పర్యటనలోనైనా కేసీఆర్ మౌనం వీడుతారా? ఒక వేళ మౌనం వీడితే తన స్పీచ్ ద్వారా ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అనేది సస్పెన్స్ గా మారింది.

కాంగ్రెస్సా? బీజేపా?:

ప్రస్తుతం బీఆర్ఎస్ లో పరిణామాలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ఓ వైపు లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ రోజుకో కీలక పరిణామం, మరో వైపు బీఆర్ఎస్ నుంచి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటం గులాబీ పార్టీలో కలవరం రేపుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఈ అంశాలపై ఇప్పటి వరకు బహిరంగంగా మాట్లాడని కేసీఆర్ పూర్తి స్థాయిలో ఎటాక్ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం పార్టీలోని ముఖ్య నేతలతో చర్చలకే పరిమితం అయ్యారని ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాటాలకు దిగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రేపటి నుంచి చేపట్టబోయే జిల్లాల పర్యటనలో గులాబీ బాస్ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారో అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం కేసీఆర్ ఫిబ్రవరి 13న నల్గొండ సభ, మార్చి 12న కరీంనగర్ కదనభేరి సభలో హాజరయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే కవిత అరెస్ట్ పై కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన, ప్రకటన విడుదల చేయలేదు. కూతురిగా కాకపోయినా కవిత పార్టీ ఎమ్మెల్సీ అనే రీజన్ తోనైనా కేసీఆర్ స్పందించలేదు. దీంతో కేసీఆర్ మౌనాన్ని సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ చేస్తున్నారు. మరో వైపు బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ వారికి టికెట్లు సైతం కేటాయింది. ఈ నేపథ్యంలో రేపటి పర్యటనలో కేసీఆర్ ఏయే అంశాలపై ఎవరెవరిని టార్గెట్ చేబబోతున్నారు? కవిత అరెస్ట్, పోన్ ట్యాపింగ్, పార్టీలో వలసలపై రియాక్ట్ అవుతారా లేక కేవలం రైతుల సమస్య వరకే పరిమితం అవుతారా అనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story