KIMs Hospital: అల్లు అర్జున్‌కు MP ఈటల రాజేందర్ కీలక సూచన

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-24 16:22:32.0  )
KIMs Hospital: అల్లు అర్జున్‌కు MP ఈటల రాజేందర్ కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌(Sri Tej)ను బీజేపీ(BJP) నేత, మల్కా్జ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్స్‌తో మాట్లాడి, కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈటలతో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. క్రికెట్ ప్లేయర్స్, పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్ వీరికి పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా పెద్దఎత్తున జనం వస్తారు. కాబట్టి వారి పర్యటన ఉన్నప్పుడు ముందస్తు ఏర్పాట్లు అవసరం అని అన్నారు.

థియేటర్ యాజమాన్యం పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం అంటున్నారు.. పోలీసులు మేము అనుమతి ఇవ్వలేదని అంటున్నారు. ఏది ఏమైనా, ఎవరి నిర్లక్ష్యమైనా ఒక నిండు ప్రాణం పోవడం బాధాకరం.. వారి బాబు ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకోవాలని హీరో అల్లు అర్జున్‌ను కోరుతున్నాను అని రిక్వెస్ట్ చేశారు. శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా వారే భరించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన అందరికీ గుణపాఠం కావాలని అభిప్రాయపడ్డారు. క్రికెట్, పొలిటికల్, సినిమా స్టార్స్ బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ పెద్దలు, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

కావాలని ఇలాంటి సంఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు. మళ్ళీ ఇలాంటివి జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలి తప్ప.. కావాలని వారిని పిలిపించి స్టేషన్లో కూర్చోబెట్టుడు మంచిది కాదని అన్నారు. ప్రధానమంత్రి మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఒక పాత బిల్డింగ్ మీద చాలా మంది ఎక్కారు.. ఆరోజు ఇల్లు కూలి ఏమైనా జరిగితే ప్రధాన మంత్రిని బాధ్యుల్ని చేసేవారా? అని ప్రశ్నించారు. కుంభమేళాలో కూడా తొక్కిలాటలు జరుగుతాయని తెలిపారు. అధికారం ఉంది కదా అని ప్రభుత్వాలు ఏదిపడితే చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఇలాంటి ధోరణిని ప్రజలు కూడా సహించరు అని తెలిపారు. దీనిని రాజకీయం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

Read More...

Allu Arjun: చిక్కడపల్లి పోలీసులకు అల్లు అర్జున్ కీలక హామీ


Advertisement

Next Story