ఈటల ఫాంహౌజ్‌లో కీలక భేటీ.. పొంగులేటి, జూపల్లి నిర్ణయంపై ఉత్కంఠ!

by GSrikanth |   ( Updated:2023-05-25 13:27:03.0  )
ఈటల ఫాంహౌజ్‌లో కీలక భేటీ..  పొంగులేటి, జూపల్లి నిర్ణయంపై ఉత్కంఠ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతలైన పొంగులేటి, జూపల్లి వ్యవహారంపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరిని ఇటీవలే బీఆర్ఎస్ బహిష్కరించడంతో వారిని తమ పార్టీలో చేర్చుకోవడం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఈ ఇద్దరితో భేటీ అయ్యారనే ప్రచారం గుప్పుమంటోంది. గురువారం హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో ఈటల రాజేందర్ ఇద్దరు సీనియర్ నేతలతో సమావేశమై చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఇద్దరు నేతలు జూపల్లి, పొంగులేటి అనే టాక్ వినిపిస్తోంది. గన్ మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా అత్యంత రహస్యంగా ఈ భేటీ జరగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. గత ఐదు గంటలుగా కొనసాగుతున్న ఈ భేటీలో బీజేపీలో చేరాలని పొంగులేటి, జూపల్లిని ఈటల ఒప్పించడంతో పాటు ఇటీవల జరిగిన తన ఢిల్లీ టూర్ సారాంశాన్ని వీరికి ఈటల వివరిస్తున్నారా లేక మరేదైనా అంశంపై చర్చిస్తున్నారా అనేది ఉత్కంఠగా మారింది.

అయితే ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో మరో వాదన వినిపిస్తోంది. గత కొంత కాలంగా బీజేపీలో అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్ కొత్త ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లాలనే నిర్ణయంతో ప్రచారం జరుగుతోంది. పైకి మాత్రం పార్టీ మారే వాదనను ఖండిస్తున్న ఈటల లోపల మాత్రం ఆవిషయంలో సీరియస్ గానే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏ పార్టీలో చేరాలనే దానిపై సందిగ్దంలో ఉన్న పొంగులేటి, జూపల్లిలతో కొత్త పార్టీ విషయమై ఈటల ఇవాళ్టి భేటీలో చర్చిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే జూపల్లి, పొంగులేటితో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఏం చర్చించారనేది బయటకు తెలియనప్పటికీ వారి మధ్య కూడా కొత్త పార్టీపైనే చర్చ జరిగినట్లు ఊహాగానాలు వినిపించాయి.

ఇదిలా ఉంటే గతంలో ఈటల రాజేందర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ సర్కిల్స్ లో జోరుగా షేర్ అవుతోంది. తాను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన సందర్భంగా తనకు కొత్త రీజనల్ పార్టీ పెట్టాలనే ఆలోచన ఉన్న మాట వస్తవమేనని ఈ ఆలోచన తనది మాత్రమే కాదని తనలాంటి అనేక మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఈటల చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను నిలువరించే ప్రయత్నాలు జాతీయ పార్టీలు చేయడం లేదని ఈ స్ట్రాటజీ చేయాలంటే మనమే చేయాలని చాలా మందిమి అనుకున్న మాట వాస్తవమే అని ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed