- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ముందుంది ముసళ్ళ పండుగ’.. CM రేవంత్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: చప్పట్లు కొట్టగానే రెచ్చిపోయి మాట్లాడేవారు కొంతమంది ఉంటారని, అలాంటివారు ఎవరి మీద పడితే వారి మీద, ఏది పడితే అదే మాట్లాడుతారని, కానీ అలాంటి వారికి ముందుంది ముసళ్ళ పండుగ అంటూ మల్కాజ్ గిరి లోక్ సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘాటుగా హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తనను పట్టుకొని మల్కాజిగిరికి ఈటల రాజేందర్‌కు సంబంధం ఏంటని అడుగుతున్నాడని, ఈటల రాజేందర్ ఒక కులానికో, ప్రాంతానికో, మతానికో సంబంధించిన బిడ్డ కాదనే విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు.
ఈ 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ బిడ్డగా, ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. రాష్ట్రంలో తొలి ఆర్థికమంత్రిగా వచ్చినప్పుడు శూన్యం నుంచి ఒక బడ్జెట్ తెచ్చుకున్నామని గుర్తుచేశారు. ఈనాడు రాష్ట్ర ఆర్థికస్థితి ఏముందో, ఏం కాగలదో చెప్పగలిగే సత్తా తనకుందని, కానీ మూడు నెలలకే ఎవరిపై విమర్శ చేయకూడదనే ఉద్దేశంతో తాను ఏమీ మాట్లాడలేదన్నారు. తన మొత్తం రాజకీయ జీవితంలో ఏ నాయకుడిపై కానీ, ఏ పార్టీపై కానీ వ్యక్తిగత దూషణలు చేయలేదన్నారు. తనకు ఆ సంస్కారం ఉందని ఈటల ఘాటుగా స్పందించారు. పొలిటికల్ లీడర్ ఉన్నతంగా ఉండాలని, సంకుచితంగా ఉండేవాడు పొలిటికల్ లీడర్ కాడని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
పొలిటికల్ లీడర్ సంకుచితవాది, డైరెక్షన్ లేని వాళ్ళు అయితే వ్యవస్థ కూలిపోతుందని తాను నమ్ముతానన్నారు. అలాంటి చిన్న, కురుస నాయకుల గురించి తాను మాట్లాడనని ఈటల ఫైరయ్యారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి రాసుకున్నోడికి తెలియదని, విన్న వారికి కూడా తెలుసుకునే ఆస్కారం లేకుండా పోయిందన్నారు. ఇచ్చిన హామీలు అమలై ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానని ఈటల రాజేందర్ కోరారు.