- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కాంగ్రెస్ 17 స్థానాలు గెలిచినా జరగబోయేది అదే.. ఈటల సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో:రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ ఏమైందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఆదివారం మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని ధ్వజమెత్తారు. మహిళలకు రూ.2500 ఇస్తామని ఇవ్వేలేదని, రూ.2 వేల పింఛన్ ను నాలుగు వేలు చేస్తామన్నారు ఎప్పుడు చేస్తారని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను దివాళా తీసిందని కారణం చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 17కు 17 ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేస్తున్నామంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని, తెలంగాణలో 17 సీట్లు గెలిచినా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 60 ఎంపీ స్థానాలకు మించదన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాలేని కాంగ్రెస్ పార్టీ హామీలను ఎలా అమలు చేస్తుందని నిలదీశారు. నిధుల విషయంలో కేంద్రాన్ని నిందించలేరని, ఆర్థిక సంఘం కేటాయింపుల ప్రకారమే రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. తెలంగాణ ప్రజలను వంచించడానికే హామీలు ఇస్తోందని ఫైర్ అయ్యారు. ఇతర పార్టీలపై గెలిచిన వారు రాజీనామా చేయకుండా పార్టీ మారితే సస్పెండ్ చేసేలా చట్టం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. దానం నాగేందర్, కడియం శ్రీహరిని ఎలా పార్టీలో చేర్చుకుంటారు? దానంకు ఎలా టికెట్ కేటాయిస్తారని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫ వడ్డీకి, సాగుకే సరిపోయిందన్నారు.