- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దమ్ముంటే ఆ పని చేయ్’.. CM రేవంత్ రెడ్డికి ఈటల సవాల్
దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, కౌంటర్లతో పొలిటికల్ వెదర్‌ను మరింత హీటెక్కిస్తున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతూ ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అవుతున్నారు. ఇందులో భాగంగానే ఈటల ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిని ప్రకటించాలని ఛాలెంజ్ చేశారు. మల్కాజిగిరిలో తనపై పోటీ చేయించేందుకు కాంగ్రెస్ డబ్బు ఉన్న అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెతుకుతోందని ఈటల ఆరోపించారు. ఇవి డబ్బు సంచులు, ధర్మానికి మధ్య జరిగే ఎన్నికలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నీటి బుడగ అని ఈటల ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఈటల డిమాండ్ చేశారు.