- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్తగా 13 పోలీస్ స్టేషన్ల ఏర్పాటు! పైరవీలు స్టార్ట్
పునర్ వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్‌లో కొత్తగా డీసీపీ జోన్లు, ఏసీపీ సబ్ డివిజన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే వాటికి కార్యాలయాలు నిర్మించడం మరిచింది. దీంతో అక్కడ పోస్టింగులు పొందిన అధికారులు, సిబ్బంది ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేసుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా 13 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే వాటి పరిధిపై పూర్తిస్థాయి స్పష్టత రాకముందే ఇన్స్ పెక్టర్ పోస్టుల కోసం పైరవీలు మొదలయ్యాయి.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్ జోన్లను ఏర్పాటు చేసింది. డీసీపీలుగా చెన్నూరి రూపేశ్, నితికా పంత్‌కు బాధ్యతలు అప్పగించింది. జూబ్లీహిల్స్, అంబర్ పేట్ ఏసీపీ సబ్ డివిజన్లనూ ఏర్పాటు చేసి పోస్టింగులు ఇచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నార్సింగి, మేడ్చల్ సబ్ డివిజన్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహేశ్వరం సబ్ డివిజన్‌కు సైతం ఏసీపీలను నియమించింది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. కొత్తగా ఏర్పాటు చేసిన డీసీపీ జోన్లు, ఏసీపీ సబ్ డివిజన్లకు సొంతంగా పరిపాలనా భవనాలు కేటాయించలేదు. వాహనాలను సైతం ఇవ్వలేదు. దీంతో కొత్తగా నియమితులైన అధికారులు అక్కడో, ఇక్కడో సర్దుకుపోతున్నారు. పరిపాలనా భవనాలు లేకపోవడంతో అసలు ఎక్కడ కూర్చొని విధులు నిర్వహించాలో తెలియక సిబ్బంది గందరగోళపడుతున్నారు. హడావిడిగా తీసుకున్న నిర్ణయాల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా డీసీపీ, ఏసీబీ జోన్ల పరిధిని సైతం తేల్చలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా జోన్లు, పోస్టులు క్రియేట్ చేసినా ఫలితాలు రావడం కష్టమేనని పేర్కొన్నారు.
కొత్త స్టేషన్లు ఎక్కడ
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా 13 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతమున్న వాటి పరిధిని తగ్గించాల్సి ఉంటుంది. అయితే ఎక్కడ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది? అనే అంశంపై పూర్తిస్థాయి కసరత్తు జరపకుండానే ముందుకు సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
సంజీవరెడ్డినగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట్‌తో పాటు పాతబస్తీలో ఉన్న కొన్ని స్టేషన్ల పరిధులను తగ్గించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై హైదరాబాద్‌లో సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ అధికారి మాట్లాడుతూ కొత్తగా 13 స్టేషన్లు అవసరమే లేదన్నారు. పరిధి పెద్దగా ఉన్న కొన్ని స్టేషన్ల పరిధులను తగ్గించి నాలుగైదు స్టేషన్లను ఏర్పాటు చేసే సరిపోయేదని వ్యాఖ్యానించారు. అధ్యయనం చేయకుండా స్టేషన్ల సంఖ్యను పెంచితే కలిగే ప్రయోజనం శూన్యమని చెప్పారు.
అప్పుడే పైరవీలు స్టార్ట్
కొత్త పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఏర్పాటు చేస్తారో అసలు డిసైడ్ కాకముందే.. కొందరు ఇన్స్పెక్టర్లు పోస్టింగుల కోసం పైరవీలు మొదలు పెట్టినట్టు తెలిసింది. ప్రభుత్వంలోని కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే డబ్బు కూడా ఖర్చు పెట్టుకుంటామని చెబుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేసిన జూబ్లీహిల్స్, అంబర్ పేట్ సబ్ డివిజన్లలో ప్రారంభం కానున్న పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ కోసం పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. Revanth Reddy వ్యాఖ్యలపై గరం గరం