Ayodhya: అయోధ్య రామమందిరంలోకి భక్తులకు ఎంట్రీ.. ఎప్పుడంటే..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-28 15:07:43.0  )
Ayodhya: అయోధ్య రామమందిరంలోకి భక్తులకు ఎంట్రీ.. ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరం విగ్రహ ప్రతిష్ఠకు డేట్ ఫిక్స్ అయింది. ఇక వచ్చే ఏడాది జనవరి నుంచి ఆలయ సందర్శనకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. రాముడు, సీత విగ్రహాలను సాలిగ్రామాలతో చెక్కనున్నారు. ఇందుకోసం నేపాల్ నుంచి ప్రత్యేక శిలల్ని తెప్పించారు. గండకి నది తీరంలో వీటిని గుర్తించి తీసుకొచ్చారు. ఈ శిలలకు 6 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. విగ్రహం పనులు పూర్తయిన తర్వాత స్వయంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. కాగా ఇప్పటికీ ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇవి మూడు రెట్లు పెరిగినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది.

Also Read..

మే 1 నుంచి షిర్డీ బంద్.. కారణమిదే..!

లంగ్ క్యాన్సర్ ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. అవేంటో చూద్దాం

Advertisement

Next Story

Most Viewed