వేడుకలకు రెడీ! ఆవిర్భావ దినోత్సవ రిహార్సల్స్.. వేరే లెవల్!

by Ramesh N |   ( Updated:2024-06-07 15:01:33.0  )
వేడుకలకు రెడీ! ఆవిర్భావ దినోత్సవ రిహార్సల్స్.. వేరే లెవల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలకు సంబంధించిన రిహార్సల్స్‌ను నిర్వహించారు. ఈ క్రమంలోనే తెలంగాణ స్పెషల్ పోలీస్ (ట్విట్టర్) ఎక్స్ వేదికగా ఫోటోలు విడుదల చేసింది. పోలీసుల పరేడ్, మార్చ్ ఫాస్ట్, జెండా ఆవిష్కరణ, తదితర సంబంధిత రిహార్సల్స్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా, రిహార్సల్స్ నేపథ్యంలో గన్ పార్క్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా, పరేడ్ గ్రౌండ్ వద్ద, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అప్పర్ ట్యాంక్ బండ్ మీద ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు తెలిపారు.

కాగా, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలు నిర్వహిస్తారు. జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్​ అమరుల స్తూపం వద్ద అమరవీరులకు సీఎం నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్​లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. అక్కడే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియా గాంధీ ప్రసంగం, సీఎం రేవంత్ ప్రసంగం ఉంటుంది. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అనంతరం ట్యాంక్ బండ్‌పై రాత్రి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed

    null