- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు సమయాభావం తగ్గించేందుకు హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. మొదటి దశలో రెండు ఈ-గరుడ బస్సులను సోమవారం నుంచి ప్రారంభించింది.
ఈ బస్సులు బీహెచ్ఈఎల్-రామచంద్రపురం, మియాపూర్, నిజాంపేట క్రాస్ రోడ్స్, సైబర్ టవర్స్, గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు చేరుకుంటాయి. విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఈ బస్సులను వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in వెబ్‌సైట్‌ని సంప్రదించాలని సూచిస్తోంది. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విషయాలు వెల్లడించారు.