- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎలక్షన్స్ టూ మచ్ కాస్ట్ లీ..? అభ్యర్థుల్లో హై టెన్షన్!
దిశ, తెలంగాణ బ్యూరో : ఈ లోక్‌సభ ఎన్నికలు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. గతంతో పోల్చితే కాస్ట్‌లీ ఎన్నికలుగా నిలవనున్నాయి. దీంతో అభ్యర్థులకు ఖర్చుల టెన్షన్ మొదలైనది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీల పరిస్థితీ ఇలాగే ఉంది. టఫ్సెగ్మెంట్లలో పోటాపోటీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముక్కోణపు పోటీ ఉన్న చోట మరింత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. దీంతో ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగిన క్యాండిడేట్లు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 సెగ్మెంట్లలోనూ గతంలో పోల్చితే అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయని ఓ పార్టీకి చెందిన అభ్యర్థి తెలిపారు. బరిలో నిలిచిన తర్వాత విజయం కోసం ప్రస్తుత సిచ్వేషన్‌లో పోటాపోటీగా పెట్టాల్సిందేనని ఆయన నొక్కి చెప్పారు. 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి తనకు 30 శాతం అదనంగా ఖర్చు పెరిగేలా ఉన్నదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
విజయం కోసం మూడు పార్టీలు కసరత్తు
రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ సులువుగా గెలుస్తుందని పార్టీ నేతలు చెప్తుండగా, ఆయా సెగ్మెంట్‌లలో తామే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్లు బీజేపీ స్పష్టం చేస్తున్నది. మరో ఐదింటిలో కాస్త కష్టపడితే వాటినీ సొంతం చేసుకుంటామని కాంగ్రెస్ ధీమాను వ్యక్తం చేస్తుండగా, ఆ సెగ్మెంట్లలో బీజేపీ పక్కా గెలుస్తుందని ఆయా పార్టీ నేతలు నొక్కి చెప్పుతున్నారు. ఇక మూడు నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నదని పార్టీల ఇంటర్నల్‌తో పాటు ప్రైవేటు సంస్థల సర్వేలూ వెల్లడిస్తున్నాయి. పాత బస్తీ సెగ్మెంట్‌లో మాత్రం ఎంఐఎంకే అన్ని సంస్థల సర్వేలు ప్రయారిటీ ఇస్తున్నాయి. దీంతో టఫ్ ఫైట్, ముక్కోణపు పోటీ నెలకొన్న స్థానాల్లో విజయం కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ఒకరికి మంచి మరొకరు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఒక్కో సెగ్మెంట్‌కు భారీగానే...
తెలంగాణలో ఒక్కో లోక్‌సభ అభ్యర్థి సగటున దాదాపు రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆయా నేతలు అంచనా వేస్తున్నారు. టఫ్ ఫైట్ నెలకొన్న నియోజకవర్గాల్లో సుమారు రూ.75 కోట్లు, ట్రయాంగిల్ పోటీ ఉన్న చోట ఏకంగా దాదాపు రూ.100 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నదని రాజకీయ నేతలు చెప్తున్నారు. కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా ఉన్న ఓ లోక్‌సభ సెగ్మెంట్‌తో పాటు, గ్రేటర్ హైదరాబాద్‌కు సమీపపు స్థానం, కోర్ సిటీలోని మరొక కీలక స్థానంలో ఒక్కో అభ్యర్థి రూ.వంద కోట్లకు పైనే ఖర్చు పెట్టే అవకాశం ఉన్నదని మూడు పొలిటికల్ నేతలు అంచనా వేస్తున్నారు.