- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తూర్పున హస్తం.. పశ్చిమాన కమల వికాసం..!
దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో వివిధ సర్వే ఏజెన్సీలు తేల్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకారం ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ రెండు నుంచి మూడు స్థానాలు మాత్రమే అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకున్నది. వచ్చినట్టుగానే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గట్టి పోరాటం చేసి ఉమ్మడి జిల్లాలో తన ప్రతాపాన్ని చూపుతున్నది. మరోవైపు బహుజన సమాజ్ పార్టీ సైతం ఒక నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫలితాలు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు పార్టీల నేతలు కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠతను రేపుతున్నాయి.
తూర్పున కాంగ్రెస్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ గాలి విపరీతంగా కనిపించింది. ఈ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాల్లో మూడు స్థానాల్లో ఆధిక్యత స్పష్టంగా ఉందని అంచనా వేస్తున్నారు. బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన సోదరుడు, మాజీ మంత్రి గడ్డం వినోద్ ఇద్దరు కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తూర్పు ప్రాంతంలోని సిర్పూర్ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపోటములతో దోబూచులాడుతున్నారు.
ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సమీప ప్రత్యర్థిగా కనిపిస్తున్నారు. వీరిద్దరి నడుమనే గట్టి పోటీ ఉందని అధికార పార్టీ అభ్యర్థి మూడో స్థానం తప్పదన్న సంకేతాలు ఉన్నాయి. ఇక ఆదివాసుల ఖిల్లా అయిన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అధికార భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి కోవ లక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్ నడుమ గట్టి పోటీ ఉందని చెబుతున్నారు. అనేక సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతుండగా, బీఆర్ఎస్ కూడా గెలుపొందే అవకాశం ఉందని మరికొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. తుడుం దెబ్బ నేత కోట్నక్ విజయ్ బరిలో లేకపోతే అధికార పార్టీ కచ్చితంగా విజయం సాధించాలని ఓ సర్వే సంస్థ తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్యాం నాయక్ వ్యూహాత్మకంగా వ్యవహరించి గెలుపు తీరాలకు చేరుతున్నారని సమాచారం.
అనూహ్యంగా పశ్చిమాన బలపడ్డ కమలం..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా బలపడింది. ఈ ప్రాంతంలో కచ్చితంగా మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలుపొందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మైనారిటీ ఓటర్ల ప్రభావం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే అధికార పార్టీ కొంత బలం చాటేలా ఉంది. ముథోల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ దాదాపుగా విజయం సాధించడం ఖాయమని తెలుస్తోంది. ఖానాపూర్ నియోజకవర్గంలో నిన్నటిదాకా కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు విజయం సాధిస్తారని అంచనా ఉండగా... అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ పుంజుకున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బిజెపి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. నిర్మల్ పట్టణంలో మైనార్టీ ఓటర్లు గణనీయంగా ఆయన వైపు మొగ్గు చూపినట్లు అంచనా వేస్తున్నారు.
అయితే గ్రామీణ ప్రాంతాల్లో కమలం గాలి బలంగా ఉన్నట్లు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. యువత తటస్థ ఓటర్లు ఉద్యోగులు భారీగా బిజెపి కి ఓటు వేసినట్లు సమాచారం. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ అధికార పార్టీ అభ్యర్థి జోగు రామన్నల నడుమ అటు ఇటు అన్నట్లుగా పోటీ ఉన్నట్లు సమాచారం ఉంది. బోథ్ నియోజకవర్గంలోనూ ముందుగా అధికార పార్టీ అభ్యర్థి అనిల్ యాదవ్ గెలుస్తారని ప్రచారం జరిగింది పోలింగ్ మధ్యాహ్నం నుంచి క్రమంగా బిజెపి వైపు మళ్లినట్లు సర్వే ఏజెన్సీలు చెప్పుకొస్తున్నాయి అధికార పార్టీ గట్టిగా నమ్ముకున్న తలమడుగు తాంసి, బీంపూర్ మండలాల్లో బిజెపి వైపు ఓటర్లు మళ్లినట్లు ఈ కారణంగా అధికార పార్టీ గెలుపోటములపై ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి మొత్తం మీద గురువారం నాటి పోలింగ్ అధికార పార్టీకి బలమైన షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది దీన్ని సొంత పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు.