- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏక్ ఝూట్.. దూస్ రా లూట్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై ప్రధాని విసుర్లు
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ఈ రెండు పార్టీలు ఏక్ ఝూట్.. దూస్రా లూట్ లా వ్యవహరిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినప్పటికీ...బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా ప్రజల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోందని పీఎం ప్రశ్నించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ తెలంగాణకు వచ్చిన ప్రధాని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూ. 7 వేల కోట్ల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో మోడీ మాట్లాడారు.
తెలుగులో ప్రసంగం..
‘నా తెలంగాణ కుటుంబం సభ్యులారా’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. రామ మందిర ద్వారాలు తెలంగాణలోనే తయారు అయ్యాయని మోడీ గుర్తు చేశారు. హైదరాబాద్‌లో రాంజీ గోండ్ పేరుతో ఆదివాసీ మ్యూజియం ప్రారంభించామని, సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబర్ వర్సిటీని స్థాపించామని, తెలంగాణ రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశామని పీఎం పేర్కొన్నారు. త్వరలో తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అబ్ కీ బార్ చార్ సౌ పార్..
వికసిత్ భారత్ కోసం బీజేపీ కృషి చేస్తున్నదని దేశంలోని అన్ని వర్గాల వారు అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటున్నారని ‘400 సీట్లు రావాలంటే బీజేపీకి ఓటు వేయాలి’ అని కోరారు. మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారంటీ అంటూ తెలుగులో వ్యాఖ్యలతో సభికులను ఉత్సాహపరిచారు. తనకు తెలంగాణ ప్రజల ప్రేమ, ఆప్యాయత కావాలని మీకు సేవ చేసేందుకు పరితపిస్తున్నానని, బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మోడీ పేర్కొన్నారు.