పల్లెలపై జేపీఎస్‌ల నిరసన ఎఫెక్ట్.. ఆల్టర్నేట్‌కు ఏర్పాట్లు

by Sathputhe Rajesh |
పల్లెలపై జేపీఎస్‌ల నిరసన ఎఫెక్ట్.. ఆల్టర్నేట్‌కు ఏర్పాట్లు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఓపీఎస్, జేపీఎస్‌లను రెగ్యులర్ చేయాలని ఏకైక సింగిల్ ఏజెండాతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెబాట పట్టడంతో పచ్చని పల్లెలపై ప్రభావం చూపుతోంది. గత వారం రోజులుగా శాంతియుత నిరసనలు చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరవధికంగా సమ్మెబాట పట్టారు. గ్రామపంచాయతీ జూనియర్ సెక్రటరీలను రెగ్యులర్ చేస్తూ నాలుగు సంవత్సరాల ప్రొబెషనరీ కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. 2019 ఏప్రిల్ 12న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరిన విషయం తెల్సిందే. టీఎస్‌పీఎస్సీ ద్వారా రాత పరీక్ష రాసి ఎంపికైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను శిక్షణ కాలం(ప్రొబెషనరీ) ఇటీవల ఏప్రిల్ 12తో ముగిసినా ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడంతో పంచాయితీ కార్యదర్శులు నిరసన బాటపట్టారు.

నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 76 మంది రెగ్యులర్ సీనియర్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. 391 మంది జూనియర్ పంచాయ తీ కార్యదర్శులు ఉండగా 30 మంది ఓపీఎస్ సెక్రటరిలు పని చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందు‌లో 150 మంది రెగ్యులర్ పంచాయతీ సెక్రటరీలు, 325 జూనియర్ పంచాయతీ కార్యదర్శు‌లు పని చేస్తుండగా 51మంది ఓజేపీఎస్‌లు పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో 42 గ్రామ పంచాయితీ ల్లో సెక్రటరిలు సమ్మెలో ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 371 మంది పంచాయతీ కార్యదర్శులు సమ్మెలో కొనసాగుతున్నారు. గత వారం రోజులుగా వారు పంచాయతీల వైపు కన్నెత్తి చూడలేని పంచాయతీ కార్యదర్శులు సమ్మెబాట పట్టడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఎంపీడీవో, ఎంపీవో, మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్లు, ఐకెపీ సీఏలకు పంచాయతీల బాధ్యతలు అప్పజెప్పారు. దాంతో వారు సొంత విధులు నిర్వహిస్తునే పంచాయతీలపై పెత్తనం చేయడం కుదరడం లేదు.

పంచాయతీ కార్యదర్శి ఆందోళనబాట పట్టడం‌తో గ్రామ పంచాయితీల పాలన పడకేసింది. దాదాపు 4 సంవత్సరాల క్రితం సీనియర్ పంచాయతీ కార్యదర్శులు ఒక్కొక్కరికి 3, 4 పంచాయతీల బాధ్యతలు ఉండేవి. దానిని తప్పిస్తూ ఆయా పంచాయతీలకు కార్యదర్శులుగా నియమించేందుకు టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు జరిపినా వారి శిక్షణ కాలం ముగిసినా రెగ్యులర్ చేయకపోవడంతో వారు ఆందోళనబాట పట్టిన విషయం తెల్సిందే. పంచాయతీ కార్యదర్శులు లేక గ్రామాలలో ప్రధానంగా పారిశుధ్యం పడకేసింది. గ్రామాల్లో ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు అక్కడే ఉండి విధు లు నిర్వహించే కార్యదర్శులు లేకపోవడంతో పచ్చని పల్లెల్లో దాని ప్రభావం కనబడుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కోసం నర్సరీల నిర్వాహణ పట్టించుకునే వారే కరువయ్యారు.

పల్లెప్రకతి వనాలు, అవె న్యూ ప్లాంటేషన్ పనులు పర్యవేక్షణ కొరవడింది. గ్రామాలలో ఈజీఎస్ నిధులతో జరిగే పనులకు పర్యవేక్షణ తాత్కాలిక సిబ్బందికి ఇబ్బందిగా మారింది. గ్రామాలలో ట్రాక్టర్ల వాయిదాల చెల్లింపులతో పాటు పంచాయతీల పర్యవేక్షణ సెక్రటరిలకే ఉండగా వారు లేకపోవడంతో ఇప్పుడు బకాయిలు పెరిగిపోయి ట్రాక్టర్ల ను లాక్కపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం జేపీఎస్ ల నిరసనను సీరియస్ గా తీసుకోకపోతే పాత పంచాయతీల సంగతి అటుంచి కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, తాండలలో ఏర్పడిన పంచాయతీలలో పరిస్థితి దారుణంగా తయారవ్వడం ఖాయంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed