ఆ అంశంలో విద్యాశాఖ మంత్రి ఆధారాలు లేవంటున్నారు!.. మరి ఇవేంటి?.. కేటీఆర్ ట్వీట్

by Ramesh Goud |
ఆ అంశంలో విద్యాశాఖ మంత్రి ఆధారాలు లేవంటున్నారు!.. మరి ఇవేంటి?.. కేటీఆర్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేసే సున్నితమైన అంశంపై ఎన్డీఏ ప్రభుత్వానికి ఎందుకు అంత నిర్లక్ష్యం అని, విద్యాశాఖ మంత్రి ఎందుకు అంత కఠినంగా తిరస్కరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నీట్ వ్యవహరం పై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన ఆయన దీనికి సంబందించిన పలు పేపర్ క్లిప్పింగ్ లను పోస్ట్ చేశారు. ఇందులో నీట్ పేపర్ లీక్ అయ్యింది అనడానికి ఆధారాలు లేవని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. కానీ బీహార్ లో ఇద్దరు నిందితులు నీట్ పేపర్ లీక్ లో తమ పాత్రను అంగీకరించారు అని, అలాగే బీహార్ పోలీసులు నీట్ పేపర్ లీక్ సంబందం ఉన్న వారి నుంచి ఆరు పోస్ట్ డేటెడ్ చెక్కులను సేకరించారు అని, బీహార్ పోలీసులు నీట్ లీక్ అంశంలో 9 మందిని విచారణకు పిలిచారు అని పలు పేపర్లలో వచ్చిన క్లిప్పింగ్ లను ఆధారాలుగా చూపెట్టారు.

దీనిపై నీట్ పరీక్షకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు మరియు వారి కుటుంబాలను ప్రభావితం చేసే సున్నితమైన & ముఖ్యమైన విషయంపై ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. అంతేగాక స్పష్టంగా పరిష్కరించాల్సిన పెద్ద సమస్య ఉన్నపుడు విద్యాశాఖ మంత్రి ఎందుకు కఠినంగా తిరస్కరించారు? అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాగా నీట్ అంశంపై ఉన్నత స్థాయి కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించి నిందితులను వెంటనే శిక్షించాలని, నీట్ వ్యవహారం వల్ల నష్టపోయిన విద్యార్ధులకు న్యాయం జరిగేలా చూడాలని ఎన్డీఏ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.

Advertisement

Next Story

Most Viewed