- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీచర్ల బదిలీల్లో నయా గోల్‌మాల్
దిశ, తెలంగాణ బ్యూరో: టీచర్ల బదిలీల్లో ‘స్పౌజ్ పాయింట్లు’ గోల్ మాల్ జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతున్నది. టీచర్ల బదిలీల్లో నయా గోల్‌మాల్ స్పౌజ్ కేటగిరిని దుర్వినియోగం చేశారని,. దీని కోసం తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించారని విద్యాశాఖ భావిస్తున్నది. దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. అయితే తప్పు జరిగినట్లు నిర్ధారణ అయితే సస్పెండ్ చేసే అవకాశమున్నట్లు చర్చ జరుగుతున్నది.
200 మంది గుర్తింపు?
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ నుంచి ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. దీంతో జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. టీచర్ల బదిలీల్లో కొందరు అడ్డదారులు తొక్కినట్లు గుర్తించారు. డీఈవోల ప్రాథమిక విచారణలో సుమారు 200 మంది వరకు టీచర్లు తప్పుడు డాక్యుమెంట్లు అందించినట్లు తేలింది. అందులో 150కి పైగా పూర్తిస్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే అనుమానం వ్యక్తమవుతున్నది. ఉద్యోగులుగా ఉన్న భార్యాభర్తలు ఒకే దగ్గర పనిచేసే విధంగా బదిలీల్లో స్పౌజ్ కేటగిరీకి అవకాశం కల్పించారు. ఈ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంటే 10 పాయింట్లు అదనంగా వారికి లభిస్తాయి. అయితే హెచ్ఆర్ఏ కోసం కొందరు టీచర్లు తమకు నచ్చిన, ఎక్కువ హెచ్ఆర్ఏ వచ్చే మండలాలకు వెళ్లేలా వెబ్ ఆప్షన్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ‘స్పౌజ్’ కు దగ్గరలో స్కూళ్లు ఉన్నా.. హెచ్ఆర్ఏ కోసం దూర ప్రాంతాల్లోని పాఠశాలలను ఎంపిక చేసుకున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ..
ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల్లో స్పౌజ్ టీచర్ల బదిలీల్లో ఈ తంతు ఎక్కువగా జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కూడా ఇలా జరిగినట్లు భావిస్తున్నారు. భార్యాభర్తలు ఒకే చోట ఉండేందుకు కూడా చాలా ప్రాంతాల్లో అవకాశమున్నా.. ఎంపిక చేసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం టీచర్ల బదిలీల్లో ఆప్షన్ ఫారాలను పరిశీలిస్తుండటంతో.. పలువురు టీచర్లు కావాలనే తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించారని విద్యాశాఖ గుర్తిస్తున్నది.
ఎనిమిదేండ్లలో ఒకసారే అవకాశం
స్పౌజ్ టీచర్ల బదిలీలకు సంబంధించి ఎనిమిదేండ్లలో ఎవరో ఒకరు మాత్రమే ఈ పాయింట్లను వినియోగించుకోవాలనే నిబంధనను సైతం పలువురు టీచర్లు ఉల్లంఘించినట్లు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించిన టీచర్లపై సస్పెన్షన్ వేటు వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతున్నది. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 11 మంది హెడ్మాస్టర్లను అధికారులు సస్పెండ్ చేశారు. ఇతర జిల్లాల్లోనూ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీచేశారు. తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ నుంచి ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు అందడంతో టీచర్లలో టెన్షన్ మొదలైంది.