Akunuri Murali: కేసీఆర్‌నే తప్పు పడుతా! విద్యా వ్యవస్థను నాశనం చేశాడు: విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి

by Ramesh N |
Akunuri Murali: కేసీఆర్‌నే తప్పు పడుతా! విద్యా వ్యవస్థను నాశనం చేశాడు: విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేను మళ్ళీ మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావునే తప్పు పడుతాను.. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని రిటైర్డ్ ఐఏఎస్, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్‌తో మీడియాతో మాట్లాడారు. ధనవంతమైన తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైన యూరోపియన్ స్కూళ్లను కట్టాల్సిన అవకాశం ఉన్న తరుణంలో డబ్బులను నాశనం చేశాడని విమర్శించారు. రైతులు కానీ రైతులకు రైతుబంధు రూపంలో కొన్ని వేల కోట్లు ధారాదత్తం చేశాడని చెప్పారు.

పిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెట్టి, చెత్త కార్యక్రమాల మీద ఖర్చు పెట్టి, పిచ్చి అడ్మినిస్ట్రేషన్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశమన్నారు. కాగా, ఆకునూరి మురళి మాట్లాడిన వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story