Nageswara Rao: బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్

by Prasad Jukanti |   ( Updated:2024-09-03 14:51:11.0  )
Nageswara Rao: బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుకు సంబంధించిన కంపెనీ మధుకాన్ ప్రాజెక్ట్స్ పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ వేస్ లిమిటెడ్ మధుకాన్ ప్రాజెక్ట్ కేసులో దాఖలైన ఈ చార్జిషీట్ ను స్పెషల్ కోర్టు (పీఎంఎల్ఏ) పరిగణలోకి తీసుకుంది. రాంచీ-జంషెడ్ పూర్ మధ్య 4వ లైన్ హైవే నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు కోసం గతంలో మధుకాన్ కంపెనీ బ్యాంకు నుంచి రూ.1030 కోట్లు తీసుకుంది. పూర్తి రుణ మొత్తాన్ని పొందినప్పటికీ ప్రాజెక్టు పనులు మాత్రం మధుకాన్ గ్రూప్ పూర్తి చేయలేకపోయింది. దీంతో జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలతో రాంచీ ఎక్స్ ప్రెస్ వేస్ లిమిటెడ్, దాని డైరెక్టర్లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో మధుకాన్ కంపెనీలపై సోదాలు నిర్వహించిన ఈడీ.. రూ.34 లక్షల నగదుతో పాటు 105 ప్రాపర్టీస్ ను అటాచ్ చేసింది. మధుకాన్ కంపెనీకి చెందిన రూ. 96.21 కోట్లను ఈడీ జప్తు చేసింది. ఈ క్రమంలో తాజాగా చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.. రాంజీ-జంషెడ్ పూర్ మధ్య హైవే నిర్మాణం కోసం కంపెనీ రూ. 1030 కోట్లు రుణం తీసుకుని వాటిలో రూ.365.78 కోట్ల మొత్తాన్ని ఇతర షెల్ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించామని పేర్కొంది. కాగా పూర్తి రుణం పొందినప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోకపోవడంతో కంపెనీ కాంట్రాక్ట్ రద్దయింది.

Advertisement

Next Story

Most Viewed