Breaking News: కేసీఆర్‌కు షాకిచ్చిన ఈడీ

by karthikeya |   ( Updated:2024-10-11 09:22:00.0  )
Breaking News: కేసీఆర్‌కు షాకిచ్చిన ఈడీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జీఎస్టీ స్కామ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. జీఎస్టీ చెల్లింపుల్లో 46 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటికే దీనిపై హైదరాబాద్ సీసీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎస్‌ నేతృత్వంలో జీఎస్టీ స్కామ్‌ జరిగినట్టు నిర్ధారించిన ఈడీ అనర్హులకు జీఎస్టీ రీపేమెంట్‌ చేసినట్లు గుర్తించింది.

అసలేంటీ కేసు..?

తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సోమేశ్ కుమార్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో జీఎస్‌టీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల లావాదేవీల్లో దాదాపు రూ.1000 కోట్ల స్కాం చేశారని ఆరోపణలొచ్చాయి. ఓ సంస్థ, ముగ్గురు వ్యక్తులతో కలిసి ఈ స్కాం చేసినట్లు ప్రధాన ఆరోపణ. దీనిపై హైదరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ కె. రవికుమార్ పోలీసు డిటెక్టివ్ విభాగానికి ఫిర్యాదు చేయగా.. ఆ ఫిర్యాదు మేరకు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఎ. శివ రామ ప్రసాద్‌పై కూడా కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే కేసీఆర్‌పై ‘ఈడీ కేసు నమోదు చేసిందం’టూ 3 నెలల క్రితమే బీజేపీ ఎంపీ రఘునంనదనరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌తో పాటు హరీశ్ రావుకు కూడా ముందుంది ముసళ్ల పండగ అంటూ అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే రఘునందనావు చేసిన వ్యాఖ్యలు గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై కాగా.. ఇప్పుడు కేసీఆర్‌పై కేసు నమోదైనది మాత్రం జీఎస్టీ స్కాంలో కావడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed