KTR: కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు.. ట్వీట్ లో సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |
KTR:  కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు.. ట్వీట్ లో సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్ములా- ఈ కారు రేసు కేసు (Formula - E car race case) వ్యవహారంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) కేటీఆర్ (KTR) కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న తమ ఎదుట విచారణకు రావాలని మంగళవారం ఇచ్చిన నోటీసులలో ఈడీ పేర్కొంది. కాగా గతంలో ఇచ్చిన నోటీసుల ప్రకారం కేటీఆర్ ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉందని తీర్పు వెలువడే వరకు విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలంటూ నిన్న ఈడీకి కేటీఆర్ ఈ-మెయిల్ ద్వారా కోరారు. కేటీఆర్ విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ సానుకూలంగా స్పందించింది. అయితే రిజర్వ్ లో ఉన్న తీర్పు ఇవాళ వెలువడింది. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం రావాలంటూ తాజాగా నోటీసులు జారీ చేసింది.

నా మాటలు రాసిపెట్టుకోండి:కేటీఆర్

తాజా పరిణామాలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నామాటలు రాసిపెట్టుకోండి. ఈ ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. ఈ అబద్దాలు నన్ను దెబ్బతీయలేవు. మీ ఆరోపణలు నన్ను తగ్గించలేవు. కుట్రలతో నా నోరు మూయించలేరు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయి. నేను న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. కాలంతో పాటు నిజాలు బయటకు వస్తాయి' అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story