నిర్మల్ యూబిట్ స్కామ్ కేసులో ఈడీ ఎంటర్

by Y. Venkata Narasimha Reddy |
నిర్మల్ యూబిట్ స్కామ్ కేసులో ఈడీ ఎంటర్
X

దిశ, వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లాలో క్రిఫ్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో ఫేక్ యాప్ ద్వారా కోట్లు కొల్లగొట్టిన యూబిట్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు చేయనుండటం జిల్లాలో సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ స్కామ్ పై కేసు నమోదు చేసి 8మంది టీచర్లను నిర్మల్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. యూబిట్ కాయిన్‌ చైన్‌దందా స్కామ్ లో మనీలాండరింగ్ అనుమానాలతో ఈడీ దర్యాప్తుకు నిర్ణయించి రిమాండ్ నివేదిక, నిందితుల వివరాలు, బ్యాంకు ఖాతాలను ఇవ్వాలని పోలీసులకు లేఖ రాసింది. నిందితుల వివరాలు అందాక ఈడీ ఈ కేసులో యూసీఐఆర్ నమోదు చేయనుంది.

యూబిట్ స్కామ్ కేసులో ఒక్క నిర్మల్ జిల్లాలోనే 50కోట్లు కొల్లగొట్టారని, 1500మంది బాధితులు ఉన్నారని , వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. లక్షకు 14వేలు ఇస్తామని చెప్పి యాప్ ద్వారా మోసానికి పాల్పడినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత మంది ప్రభుత్వ ఉద్యోగుల, జిల్లా ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed