- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడుల కలకలం
దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్‌లో ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) కలకలం రేపాయి. తాజాగా పలు ఫార్మా కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ తెల్లవారుజాము నుండి నగరంలో ఏకకాలంలో 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పటాన్ చెరు, మాదాపూర్‌లోని ఫార్మా కంపెనీ ఆఫీస్‌ల్లో, డైరెక్టర్ల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ప్రముఖ ఫార్మా కంపెనీ జువెన్ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఉన్న 100కు పైగా కంపెనీలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు రైడ్ చేశారు. ఇందులో 18 కంపెనీల లైసెన్సులను రద్దు చేశారు. రద్దయిన ఫార్మా కంపెనీల లిస్ట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సెలాన్ ఫార్మా కంపెనీ లైసెన్స్‌ను అధికారులు ఇప్పటికే రద్దు చేశారు. క్యాన్సర్ వ్యాధి భారిన పడుతున్న రోగులకు మందులను సెలాన్ కంపెనీ తయారు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు పలు ఫార్మా కంపెనీల కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు.