పక్కా ప్రణాళికతో వెళ్లాం.. పెట్టుబడులపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
పక్కా ప్రణాళికతో వెళ్లాం.. పెట్టుబడులపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు(Proddutur)లో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కు(Eco Friendly Experium Park)ను మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్‌ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారని ఫైర్ అయ్యారు.

కానీ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారని అభినందించారు. పక్కా ప్రణాళికతో వెళ్లాం కనుకే అన్ని పెట్టుబడులని కీలక వ్యాఖ్యలు చేశారు. 13 నెలల్లో రూ.లక్షా 80వేల కోట్ల పెట్టుబడులొచ్చాయని మరోసారి వెల్లడించారు. సింగపూర్‌ ప్రభుత్వం(Singapore Govt)తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌(Skill development)లో ఇదో అద్భుత పరిణామంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టెంపుల్, ఎకో టూరిజంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. తెలంగాణలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయని.. రామప్ప, వేయిస్తంభాలగుడి లాంటి ప్రపంచ ప్రఖ్యాత మందిరాలు ఉన్నాయని చెప్పారు.

మన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు తగిన గుర్తింపు తీసుకురాలేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో టెంపుల్, ఎకో టూరిజం వెనకబడుతోంది. అందుకే టూరిజం పాలసీ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు వికారాబాద్‌(Vikarabad)లోనే మొక్కలు దొరుకుతున్నాయి. వికారాబాద్ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వికారాబాద్‌ను ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కాగా, తెలంగాణ చరిత్రలో లక్షా 79 వేల పెట్టుబడులు రావడం రికార్డ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంవత్సర కాలంగా రాష్ట్రం సాధించిన పురోగతే ఈ పెట్టుబడులకు కారణమని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed