- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు తెలంగాణకు ఈసీ ప్రతినిధులు.. ఎలక్షన్స్ అప్పుడే జరపాలని ప్లాన్!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రానున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు. నేడు తెలంగాణ ఎన్నికల కమిషనర్ తో ప్రతినిధులు భేటీ కానున్నారు. రేపు కలెక్టర్లు, ఎస్పీలు, 24న చీఫ్ సెక్రటరీతో సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసే చర్యలు చేపట్టనున్నారు. 2023లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే తెలంగాణలో వచ్చే ఏడాది జనవరి 16లోగా ఎన్నికలు పూర్తయి కొత్త సభ కొలువు తీరాల్సి ఉంది.
ఇందు కోసం కేంద్ర ఎన్నికల సంఘం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఓటర్ల జాబితా తయారీ, ఈవీఎంలు సిద్ధం చేయడం, అధికారులకు ట్రైనింగ్ సంబంధిత అంశాలపై ఈసీ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణను కూడా చేపట్టనుంది. ఇందుకు గాను ఈసీ స్టేట్ లో పర్యటించనుంది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, పోలీసు నోడల్ ఆఫీసర్, కేంద్ర సాయుధ బలగాల అధికారితో ఈసీ సమావేశం కానుంది. ఎన్నికల సన్నద్ధతను ఈసీ బృందం సమీక్షించనుంది.