సొంత అజెండా వద్దు.. ముఖ్యమంత్రి పోస్ట్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2024-06-17 10:36:07.0  )
సొంత అజెండా వద్దు.. ముఖ్యమంత్రి పోస్ట్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి సొంత అజెండాతో పని చేయవద్దని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పనుల నిమిత్తం ముఖ్యమంత్రిని కలిస్తే దానికి చెడు ఉద్దేశ్యాలు అపాదించవద్దుని, పనుల నిమిత్తం ఏ రాజకీయ పార్టీ నేతలైనా సీఎంను కలిసే కల్చర్ రావాలన్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఆదివారం జరిగిన కృతజ్ఞతా సభలో మాట్లాడిన ఈటల.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి పని చేయాలని సూచించారు. తాను అసెంబ్లీలో ప్రజల సమస్యలపై నిత్యం కొట్లాడేవాటిని అలా నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడాను. సభలో కొట్లాడాక ఆ వెంటనే దరఖాస్తు పట్టుకుని ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లేవాడిన్నారు. తనను చూసిన సీఎంలు ఇప్పటి వరకు సభ జరగనివ్వని నేకెందుకు నిధులు ఇవ్వాలని ప్రశ్నించేవారని కానీ ముఖ్యమంత్రి పదవి అంటే పార్టీ కాదని అది ప్రజలు ఇచ్చిన పదవి అని తాను చెప్పెవాడిన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు పట్టుబడ్డి మరీ తనను గెలిపించుకున్నారని ఈ విజయం మల్కాజిగిరి ప్రజలకు అంకితం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులకు ఓనర్లు ప్రజలే అని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఏ సమస్యకైనా నో అనేది నా డిక్షనరీలోనే లేదని ప్రతి సమస్యకు ఎక్కడో ఓ చోట పరిష్కార మార్గం ఉంటుందని నమ్మే వ్యక్తిని తాను అని చెప్పారు.

రామోజీరావుకు నివాళి:

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, తెలుగు మీడియా దిగ్గజం రామోజీ రావు అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లిన ఈటల రాజేందర్ అక్కడ రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం రామోజీ రావు కుటుంబ సభ్యులను పరామర్శఇంచారు.

Advertisement

Next Story

Most Viewed