- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కష్టం మాదైతే క్రెడిట్ కేసీఆర్ కు దక్కింది.. ఎన్నికల ప్రచారంలో ఈటల
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ ఉద్యమంలో తాము కష్టపడితే పేరు కేసీఆర్ కు వచ్చిందని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. 14 ఏళ్లు తెలంగాణ కోసం పోరాడామని వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా ప్రాణాలు పణంగా పెట్టి పేషంట్ల మధ్య తిరిగిన బిడ్డను నేను అన్నారు. ఆదివారం కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఇర్రెలవెంట్ అన్నారు. ఎవరు ఎటుపోతే నాకేంటి నేను సీఎం అయితే చాలు.. నా పార్టీ అధికారంలోకి వస్తే ఎలా చాలు అని రేవంత్ రెడ్డి అడ్డమైన ప్రకటనలు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు 66 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ పార్టీకి నీతి జాతి లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మల్కాజగిరికి ఏం చేస్తారో అడగాలన్నారు. రియల్ ఎస్టేట్ చేస్తే చేసుకోమనండి. ఈ రాజకీయాలు వారికి ఎందుకని ప్రశ్నించారు. ఎవరికి తలవంచకుండా ప్రజల బాగు ఎజెండాగా బ్రతుకుతున్నామని, మల్కాజిగిరి సంపూర్ణ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. శషభిషలకు ఆస్కారం లేకుండా తనను సంపూర్ణంగా ఆశీర్వదించాలని కోరారు.
మోదీ కంటే ముందు దేశంలో 3 ఎయిమ్స్ ఉంటే ఈ పదేళ్లలో 16 ఎయిమ్స్ వచ్చాయని దేశానికి ఏం చేశారని కాంగ్రెస్ వారు ఓటు అడుగుతారని నిలదీశారు. ఆ పార్టీకి ఓటు అడిగే నైతికత లేదన్నారు. ప్రధాని మోడీ ఎప్పడు అలవికాని హామీలు ఇవ్వలేదని, ఆయన బ్రతికితే దేశం కోసం బ్రతుకుతున్నారు.. చనిపోతే దేశంకోసం చనిపోతారన్నారు. కోల్పోయిన రామాలయాన్ని తిరిగి నిర్మించి దేశానికి ఉన్న అరిష్టాన్ని తొలగించిన నాయకుడు మోడీ అన్నారు. మోడీ నాయకత్వంలోనే దేశం పురోభివృద్ధి చెందుతుందని 2014లో 273 సీట్లతో సంకీర్ణ రాజకీయాలకు స్వస్తిపలికిన నాయకుడు మోడీ అన్నారు. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా ఎంపీగా గెలిచి పీఎంగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి మోడీనే అని ఇది చాలా అరుదైన విషయం అన్నారు. అప్పులు తెస్తే తప్ప గడవని భారతదేశ ఆర్థిక వ్యవస్థను 11వ స్థానం నుండి 5 స్థానానికి తీసుకువచ్చిన ఘనత మోడీదన్నారు.