- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కొక్కరు ఒక్కోలా!.. తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంట్ లో రెండవ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపధ్యంలో నిన్న తెలంగాణ ఎంపీలలో కేంద్రమంత్రులుగా ఎన్నికైన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా.. మిగిలిన 15 మంది ఎంపీలు ఇవ్వాళ ప్రమాణ స్వీకారాలు చేశారు. వీరిలో ప్రమాణ స్వీకారం అనంతరం ఒక్కోక్కరు ఒక్కోలా నినదించారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడెం నగేష్ హిందీలో ప్రమాణం చేశారు. పెద్దపల్లి వంశీ గడ్డం వంశీ కృష్ణ ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జైహింద్ అని నినదించారు. తర్వాత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా.. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ తెలుగులో ప్రమాణం చేశాక జై హింద్, జై తెలంగాణ అని నినాదాలు చేశారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇంగ్లీష్ లో ప్రమాణం చేసి జైహింద్, జై తెలంగాణ అని నినదించారు. వీరి తర్వాత మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం అనంతరం ఈటెల జై హింద్ జై తెలంగాణ, జై సమ్మక్క సారలమ్మ అని నినాదాలు చేశారు. తర్వాత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఉర్ధూలో ప్రమాణం చేస్తూ.. జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహో అక్బర్ అంటూ ప్రమాణం పూర్తి చేశారు. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఇంగ్లీష్ లోనే ప్రమాణ స్వీకారం చేసి జై హింద్ అని నినదించారు. ఇక మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలుగులోనే ప్రమాణ స్వీకారాన్ని ముగించారు. వీరి తర్వాత నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి రాజ్యాంగ పుస్తకం చేతిలో పట్టుకొని ప్రమాణం చేశారు. ప్రమాణం అనంతరం జై తెలంగాణ జైహింద్, జై తెలంగాణ, జై కాన్ స్టిట్యూషన్, జై భీం అని నినాదాలు చేశారు. తర్వాత నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి తెలుగులో తన ప్రమాణాన్ని ముగించారు. వీరి తర్వాత భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలుగులోనే ప్రమాణం చేస్తూ.. జై తెలంగాణ, జై యాదగిరి లక్ష్మీ నర్సింహా స్వామి అని నినాదాలు చేశారు.
అనంతరం వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలుగులో ప్రమాణ స్వీకారం మొదలు పెట్టి జై భీం, జై భద్రకాళీ, సేవ్ కాన్ స్టిట్యూషన్ అని ముగించారు. మహాబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి చివరలో జై తుల్జా భవాని, జై తెలంగాణ అని అన్నారు. తర్వాత ఖమ్మం ఎంపీ రామసాహయం రఘురాం రెడ్డి ఇంగ్లీష్ లో ప్రమాణం చేస్తూ.. జై హింద్, జై తెలంగాణ, జై సంవిదాన్ అని నినాదాలు చేశారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని, నిబంధనలు పరిశీలించి... రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభ్యులకు సూచించారు. అలాగే మల్లు రవి రాజ్యాంగం పుస్తకంతో వెళ్లడంపై కూడా బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపుతూ.. ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్నారు. దీంతో సభాపతి వీరికి నత్సజెప్పడంతో మల్లు రవి ప్రమాణ స్వీకారాన్ని కొనసాగించారు.