- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
E-KYC: రేషన్‌కార్డుదారులు.. పారాహుషార్! ఈ-కేవైసీ నమోదుకు నేటితో ముగియనున్న గడువు
దిశ, వెబ్‌డెస్క్: రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు, బోగస్ కార్డుల తొలగింపునకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ నేటితో ముగియనుంది. ముందుగా జనవరి 31 వరకు గడువు ఇవ్వగా, అనంతరం ఆ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకూ పొడిగించారు. ఇంకా ఎవరైనా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారు ఉంటే సమీపంలోని రేషన్ షాపుల్లోకి వెళ్లి ఈ-పోస్ యంత్రం ద్వారా వేలిముద్రలు సమర్పించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. లేదంటే వచ్చే నెల నుంచి రేషన్ సరఫరాను నిలిపి వేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల జనవరి 31లోగా ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉండగా ఫిబ్రవరి చివరి వరకు గడువును పొడిగించిన సంగతి అందరికీ విధితమే. ఇప్పటి వరకు ఎవరైనా ఈ-కేవైసీ అప్‌డేట్ చేయించుకోని వాళ్లు వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు మరోసారి ప్రభుత్వం గడువు పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది.
కాగా, రేషన్ కార్డులో పేరున్న కుటుంబ సభ్యులు.. సమీపంలోని రేషన్ షాపునకు వెళ్లి మీ రేషన్ కార్డు నంబర్, వేలిముద్రలు సమర్పించాలి. మీ రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేస్తారు. అనంతరం ఈ-కేవైసీ పూర్తి చేసినట్లు ఈ-పోస్ మిషన్ నుంచి రిసిప్ట్ వస్తుంది. రేషన్ కార్డుకు కలిగిన వాళ్లు రాష్ట్రంలో ఏ రేషన్ షాపు వద్దనైనా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి వెళ్లి వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చని తెలిపారు. విశేషం.