- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Dubbaka MLA Raghunandan rao : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్ట్
దిశ ప్రతినిధి, మేడ్చల్ : హైదరాబాద్ నుండి గజ్వేల్ కు బయలుదేరిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రఘునందన్ రావును అల్వాల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సిద్దిపేటలో ఇటీవల నూతన శివాజీ విగ్రహం ఆవిష్కరణలో బాగంగా జరిగిన హిందూ ముస్లిం గొడవలో కొంత మంది హిందువులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అరెస్ట్ అయినా వారికి కోర్టులో వాకాలత్ కోసం హైదరాబాద్ నుండి గజ్వేల్‌కు బయలుదేరిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కాగా రఘునందన్ రావు పర్యటనతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు అయనను అరెస్ట్ చేసినట్లు చెపుతున్నారు. రఘునందన్ రావు అరెస్ట్ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలి వస్తున్నారు.