- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Dubbaka: మంత్రి కొండా సురేఖకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సన్మానం
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కొండా సురేఖను మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సన్మానించారు. ఇవాళ దుబ్బాకలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్తా ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రఘునందన్ రావు దుబ్బాక నేతన్నలు తయారు చేసిన నూలు పోగు కండువాను ముఖ్య అతిథిగా వచ్చిన కొండా సురేఖకు కప్పి సత్కరించారు. అంతకుముందు, కాంగ్రెస్ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకావడంపై ప్రోటోకాల్ రగడ లేచి.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య రసాబాస జరిగింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతల మధ్యే నేతలు లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. పార్టీ కార్యక్రమాల్లో ఒకరినొకరు విమర్శించుకునే కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రభుత్వ కార్యక్రమాల్లో నవ్వుతూ సన్మానించుకోవడంతో కార్యక్రమంలో సందడి వాతావరణం నెలకొంది. అప్పటివరకు ఉద్రిక్తతల నడుమ సీరియస్ నడిచిన కార్యక్రమంలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి.