ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రంతా ఆందోళన చేపట్టిన DSC అభ్యర్థులు

by Anjali |
ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రంతా ఆందోళన చేపట్టిన DSC అభ్యర్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని డీఎస్సీ అభ్యర్థులు ఉస్మానియా యూనివర్సీటీలో రాత్రంతా ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నఅభ్యర్థుల వెంటపడి మరీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఈడ్చుకెళ్లారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు పునరావృతం అయినట్లు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ సర్కారుపై డీఎస్సీ అభ్యర్థులు మండిపడుతున్నారు. తెలంగాణ బిడ్డలకు ఎన్నికల ముందు ఆశలు చూపి అధికారంలోనివచ్చిన మరుక్షణం నుండే అణచివేతకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్ మీద నిరుద్యోగ యువత భగ్గుమంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు ఉండవని చెప్పి మహిళలను అర్ధరాత్రి రోడ్డు మీదకు ఈడ్చిండని తెలంగాణ సర్కారుపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరుద్యోగులకు 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పి అర్ధ రాత్రి రోడ్ల మీద కూర్చోవడమే కొలువులా? ఏమాయే ఎన్నికలో ఇచ్చిన హామీలంటూ గొంతెత్తి ప్రశ్నించారు. ఇదీ కాంగ్రెస్ మా నిరుద్యోగులకు ఇస్తున్న బహుమానం అంటూ ఎమోషనల్ అయ్యారు. అర్ధ రాత్రి పూట మహిళలు మాకు చదువుకోడానికి సమయం ఇవ్వమని అడుగుతున్నారంటే అసలు మీ దౌర్భాగ్యపు పాలన ఎలా ఉందో చెప్తుందని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరుద్యోగులు అందరం తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇలా అర్దరాత్రి రోడ్డు మీద నిలబెట్టడం సిగ్గుచేటని అన్నారు. DSC అభ్యర్థులకు మద్దతుగా బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు.

Advertisement

Next Story