డాక్టర్ ​శ్యాం సుందర్ ​దుర్గంకు బంగారు పతకం

by Javid Pasha |
డాక్టర్ ​శ్యాం సుందర్ ​దుర్గంకు బంగారు పతకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆయుష్మాన్ ​భారత్​, నేషనల్​హెల్త్​ మిషన్​ కార్యక్రమాల్లో విశేష సేవలు అందించినందుకు రాష్ట్రానికి చెందిన డాక్టర్​ శ్యాం సుందర్​దుర్గంకు బంగారు పతకం వరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి అదే జిల్లాలో ప్రజారోగ్య వైద్యునిగా వైద్య సేవలు అందించడంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్​, ఫ్యామిలీ వెల్ఫేర్​ ఢిల్లీ లో ప్రతిభ చూపినందుకు ఈ అవార్డును అందించినట్లు కేంద్రం పేర్కొన్నది. ఈ మేరకు నేషనల్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ గురువారం అవార్డును అందజేసి, సన్మానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్​రావు సారథ్యంలో ఆరోగ్య తెలంగాణగా తయారవుతున్నదన్నారు.

ఇక తనకు అవార్డు వచ్చేలా అన్ని రకాలుగా ప్రోత్సహించిన టీఎస్​ఎంఎస్​ఐడీసీ చైర్మన్​ డాక్టర్​ఎర్రోళ్ల శ్రీనివాస్​కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ కత్తి జనార్దన్ మాట్లాడుతూ.. పబ్లిక్​హెల్త్​డాక్టర్ శ్యామ్ కు జాతీయస్థాయిలో బంగారు పతకం రావడం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అందరూ అంకితభావంతో పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయస్థాయిలో అగ్ర భాగాన నిలిపేలా కృషి చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed