- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటి నుంచి గురుకుల ఎగ్జామ్స్.. ట్రిబ్ కన్వీనర్ డాక్టర్ మల్లయ్య బట్టు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ట్రిబ్ )కన్వీనర్ డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. నేటి నుంచి (ఆగష్టు 1వ తేదీ నుంచి) 23 వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 17 జిల్లాలలో 106 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని సోమవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.మొదటి సారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు రోజుకు మూడు షిఫ్ట్‌లలో జరుగుతాయని ఆయన తెలిపారు.అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు 30 నిమిషాల ముందే చేరుకోవాలని, హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఫోటో ఐడి కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ప్రశ్నా పత్రం ఓపెన్ కావడానికి అవసరమైన యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను పరీక్ష ప్రారంభం కావడానికి 10నిమిషాల ముందు మాత్రమే అభ్యర్థులకు అందిస్తారని ఆయన సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఖాళీగా ఉన్న 9210 పోస్టులకు గాను 2,63,045 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని మల్లయ్య బట్టు తెలిపారు. పరీక్షలు మూడు షిఫ్ట్ లలో జరుగుతున్నాయని, ఒక్కో పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుందని ఉదయం 8:30-10:30 వరకు, మధ్యాహ్నం 12:30-2:30 వరకు, సాయంత్రం 4:30-6:30వరకు పరీక్ష సమయాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.2,3 పరీక్షలు రాసేవారు తమ హల్ టికెట్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయని, ప్రతీ తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అనవసరమైన వద్దంతులను నమ్మవద్దని మల్లయ్య బట్టు సూచించారు.