నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వండి

by Sridhar Babu |
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వండి
X

దిశ,భైంసా : ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరినట్టు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. బుధవారం తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకొని ప్రధానమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందని, కేంద్ర నిధులు ఇచ్చి తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరానని తెలిపారు.

దేశంలోనే ప్రసిద్ధిగాంచిన చదువుల తల్లి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించినట్టు తెలిపారు. సీఎస్ఆర్ నిధులు, అంతర్ రాష్ట్ర రహదారుల నిర్మాణానికి, ఉపాధి హామీ పథకానికి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖ మంత్రులకు తెలియజేసి ప్రత్యేక నిధులు కేటాయించేటట్లు చూస్తానని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిశారు.

Advertisement

Next Story

Most Viewed