ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ్వరినీ వదలొద్దు: కే.కే మహేందర్​రెడ్డి

by Shiva |   ( Updated:2024-04-01 13:45:07.0  )
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ్వరినీ వదలొద్దు: కే.కే మహేందర్​రెడ్డి
X

దిశ, క్రైమ్ ​బ్యూరో: సిరిసిల్లలో రాజకీయ ప్రత్యర్థి అయిన తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని గట్టిగా నమ్ముతున్నట్లు కాంగ్రెస్ నేత సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కే.కే మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్​ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డిని కలిసి ఫోన్ ట్యాపింగ్‌పై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని వినతి చేశారు. సిరిసిల్లలో తన ఫోన్‌ను ట్యాపింగ్ చేసిన కేటీఆర్‌తో పాటు అందుకు ఆదేశాలు జారీ చేసిన గత ప్రభుత్వ పెద్దలందరిపై విచారణ చేపట్టాలన్నారు. సిరిసిల్లలో అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ స్థావరం బయటపడిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, వ్యాపావేత్తలపై గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని ఆయన ఆరోపించారు. సిరిసిల్లలో తన కదలికలను ఫాలో అవ్వడంతో చాలామంది తన వద్దకు వచ్చేందుకు భయపడ్డారని ఆయన విమర్శించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఎవరినీ వదలొద్దని ఆయన సీపీని కోరారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు కన్నుసన్నల్లోనే ఈ మొత్తం వ్యవహరం నడిచిందని మహేందర్​రెడ్డి ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed