ఎమోషన్ అవ్వకండి.. కవిత లాయర్ ను వారించిన జడ్జి

by Prasad Jukanti |
ఎమోషన్ అవ్వకండి.. కవిత లాయర్ ను వారించిన జడ్జి
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ కోసం మొదట ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో తన అరెస్ట్ చట్టవిరుద్ధమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్ , జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా కవిత తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఈ కేసులో ఒకసారి సాక్షిగా, మరొసారి నిందితురాలిగా పిలిచారని కవితకు వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు సాగుతోందని పేర్కన్నారు.ఈడీ తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన కలిల్ సిబల్.. ప్రస్తుత పరిణామాలను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేస్తున్నాయన్నారు. దీంతో భావోద్వేగానికి గురికావొద్దని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కపిల్‌ సిబల్‌ను వారించారు.

వాదనలు విన్న ధర్మాసనం... చట్టం అందరికీ ఒకటే, రాజకీయ నాయకులైనంత మాత్రాన ప్రత్యేక విచారణ ఇక్కడ జరపలేమని పేర్కొంది. ధర్మాసనం ప్రస్తుతం కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదని పిటిషన్ లో రాజ్యాంగ పరమైన విషయాలను లేవనెత్తారని వాటిపై మిగతా పిటిషన్లతో కలిసి విచారిస్తామని స్పష్టం చేసింది. విజయ్ మదన్ లాల్ కేసుతో కలిపి విచారణ చేపడతామని పేర్కొంది. ఈ కేసులో కవిత ట్రయల్ ఎదుర్కొవాల్సిందే అని తేల్చి చెప్పింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టులోనే పిటిషన్ వేయాలని కవిత తరపు న్యాయవాదికి సూచించిన ధర్మాసనం.. పిటిషనర్ మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. రాజ్యాంగ పరమైన అంశాలపై ఈటీకి నోటిసులు జారీ చేసిన ధర్మాసనం.. ఆరు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని, ఆ తర్వాత మరో రెండు వార్లోల రిజాయిండర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది.

ఇటీవలే రిట్ పిటిషన్ వెనక్కి:

ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రింకోర్టులో దాఖలు వేసిన రిట్ పటిషన్ ను కవిత వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కవిత అరెస్ట్ నేపథ్యంలో మూడు రోజుల క్రితం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలను వినిపిస్తూ... రిట్ పిటిషన్ పై విచారణ అవసరం లేనందున పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో, పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం అంగీకరించింది. దీంతో కవితకు రిట్ పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ కోసం సుప్రీంను ఆశ్రయించగా రెండు పిటిషన్లపై ఎదురుదెబ్బలే తగిలాయి.

కేజ్రీవాల్ సంగతేంటి?:

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు కేజ్రీ పిటిషన్‌ను సీజేఐ ప్రత్యేక బెంచ్‌కు కేటాయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ద్వివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ పిటిషన్‌పై విచారణ జరపనుంది. దీంతో కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story