ఆర్టీసీ ఉద్యోగాల కోసం ఆ లింకులు క్లిక్ చేయోద్దు!.. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్

by Ramesh Goud |
ఆర్టీసీ ఉద్యోగాల కోసం ఆ లింకులు క్లిక్ చేయోద్దు!.. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆ ఫేక్ లింకులు క్లిక్ చేసి వివరాలు నమోదు చేయోద్దని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగాలపై ఆన్ లైన్ లో వస్తున్న ఫేక్ లింకులపై స్పందించిన ఆయన.. ఉద్యోగార్ధులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై సజ్జనార్ ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక! అంటూ.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తును టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించిందని, 3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిపారు.

ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను అందులో పేర్కొన్న లింకులు అన్నీ ఫేక్ అని చెప్పారు. ఆ లింక్ లను ఉద్యోగార్థులు నమ్మొద్దని, క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చెయొద్దని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాగా కొద్ది రోజుల క్రితం టీజీఎస్ఆర్టీసీ లో 3035 ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిని భర్తీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తులు చేస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబందించి ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కానీ ఆర్టీసీలో ఉద్యోగాల బర్తీ కోసం తమ వివరాలు నమోదు చేసుకోవాలని కొన్ని లింకులు ఆన్ లైన్ లో దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఈ విధంగా స్పందించింది.

Advertisement

Next Story

Most Viewed