శ్రీ కంఠమహేశ్వర స్వామి గుడి నిర్మాణానికి రూ.1,10,000 విరాళం

by Sathputhe Rajesh |
శ్రీ కంఠమహేశ్వర స్వామి గుడి నిర్మాణానికి రూ.1,10,000 విరాళం
X

దిశ, దేవరుప్పుల: ఆధ్యాత్మిక చింతనతోనే మానవాళికి మనశ్శాంతి నెలకొంటుందని బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. మండలంలోని కోలుకొండ గ్రామానికి చెందిన గౌడ సంఘం నాయకులు గ్రామంలోని శ్రీ కంఠమహేశ్వర స్వామి గుడి నిర్మాణానికి యువ నాయకుడు బబ్బురి శ్రీకాంత్ గౌడ్‌ని సోమవారం పెద్దమడూరు‌లో నూతన స్వగృహంలో కలిసి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

దీంతో వెంటనే స్పందించిన యువ నాయకుడు శ్రీకాంత్ గౌడ్ గుడి నిర్మాణానికి రూ.లక్షా పదివేల రూపాయల నగదు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా బబ్బూరి శ్రీకాంత్ గౌడ్‌ను కోలుకొండ గ్రామ గౌడ కులస్తులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారుపోతుల అశోక్ గౌడ్, కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, బబ్బురి నాగరాజు గౌడ్, కారిపోతుల సత్తయ్య గౌడ్, నాయకపు శేఖర్ గౌడ్, కోలుకొండ గౌడ కులస్తులు యమగానీ నాగయ్య, యమగాని ఎల్లయ్య, కన్న రవి, కన్న సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed