- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జై భీమ్’ నినాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: అంబేడ్కర్ పేరు చెప్పగానే మనందరికి గుర్తొచ్చే నినాదం ‘జై భీమ్’. దళిత నాయకులతో పాటు అనేక మంది రాజకీయ నాయకులు ఆయా వేదికలపై ఈ నినాదాన్ని ఇస్తుంటారు. అంబేడ్కర్ భావజాలాన్ని గట్టిగా నమ్మే లక్షల మంది ఉద్యమకారులు ‘జై భీమ్’ నినాదాన్ని వాడతారు. కొంత మంది అభివాదం చేసుకునే సందర్భంలో ‘జైభీమ్’ అంటుంటారు.
డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ అసలు పేరు భీమ్ రావ్ రామ్ జీ అంబేడ్కర్. అంబేడ్కర్ వాదాన్ని విశ్వసించే వ్యక్తులు ఆయనను గౌరవంగా ‘జై భీమ్’ అని పిలుస్తారు. అంబేడ్కర్ భావజాల ఉద్యమానికి ఈ నినాదం జీవనాడిలా ఉంది. జై భీమ్ అనే నినాదం అసలు ఎప్పుడు వాడుకలోకి వచ్చింది. ఎవరు మొదటి సారిగా జై భీమ్ నినాదం ఇచ్చారు. ఎక్కడ తొలుత ఈ నినాదాన్ని వాడారు అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
నినాదం పుట్టుక ఇలా..
అంబేడ్కర్ ఉద్యమ కారుడు బాబు హర్దాస్ లక్ష్మణ్ నగరాలే 1935లో ‘జై భీమ్’ అని నినదించారు. ఈయన కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ ప్రావిన్సెస్ - బేరార్‌కు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంబేడ్కర్ భావజాలాన్ని విశ్వసించే నిబద్ధత గల కార్యకర్తగా పనిచేశారు. నాసిక్‌లోని కాలారామ్ టెంపుల్‌లో జరిగిన పోరాటం, చావ్దార్ సరస్సు సత్యాగ్రహంతో డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరు ఇంటింటికి చేరింది.
అయితే రామచంద్ర క్షీరసాగర్ రాసిన పుస్తకం ‘దళిత్ మూమెంట్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ లీడర్స్’లో బాబు హర్దాస్ ‘జై భీమ్’ నినాదాన్ని తొలిసారిగా ఇచ్చినట్లు రాశారు. అంబేడ్కర్ ప్రతి గ్రామంలో సమానత్వం గురించిన ఆలోచనలు వ్యాప్తి చెందాలనే ఆలోచనతో సమతా సైనిక్ దళ్ స్థాపించారు. ఈ సంస్థకు హర్దాస్ కార్యదర్శిగా పనిచేశారు.
దళిత్ పాంథర్స్ సహ వ్యవస్థాపకుడు జేవీఎస్ పవార్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. కామ్ ఠీ, నాగపూర్ కు చెందిన కార్యకర్తలతో హర్దాస్ ఒక దళాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఆ దళంలోని వాలంటీర్లు నమస్కార్, రామ్ రామ్, లేదా జోహార్ మాయాబాప్ లకు బదులు ‘జై భీమ్’ అనాల్సిందింగా సూచించారని తెలిపారు.
ముస్లింలు ‘సలాం వాలేకుం’ అని పలకరిస్తే ఎదుటి వారు ‘వాలేకుం సలాం’ అన్నట్లుగానే ‘జైభీమ్’ అని చెప్పగానే బదులుగా ‘బల్ భీమ్’ అని సూచించినట్లు పవార్ తెలిపారు. అంబేడ్కర్ ను ఆయన జీవించిన కాలంలోనే కొంత మంది ‘జైభీమ్’ అని సంభోధించే వారని మహారాష్ట్రకు చెందిన మాజీ న్యాయమూర్తి సురేశ్ ఘోర్పడే వెల్లడించారు.