- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్యరూపం దాల్చని ఎన్టీఆర్ జాతీయ పార్టీ.. పేరేంటో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న రోజుల్లో ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ కు జాతీయ స్థాయిలో ఆ రోజుల్లో విశిష్ట గౌరవం దక్కింది. ఎన్టీఆర్ కూడా తెలుగు నేల మీద ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా తెలుగు దేశం ఎదిగిన తర్వాత భారత్ దేశం అనే పార్టీ పేరుతో జాతీయ రాజకీయాల్లో రావాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఎన్టీఆర్ తర్వాత చంద్ర బాబు జాతీయ పార్టీ పెట్టకపోయిన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అని ప్రయత్నించారు. ఎన్డీఏలో ఉన్నారు.
తర్వాత బయటకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని బలమైన నేతల్లో ఇప్పటి వరకు జాతీయ రాజకీయాల్లో ఆసక్తి కనబరిచింది పీవీ నరసింహరావు, ఎన్టీఆర్, చంద్రబాబు కనిపిస్తారు. ఇక ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీని ఈ దసరా పండుగకి ప్రారంభించారు. ఇటీవల ఈసీ పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చిన సందర్భంగా ఢిల్లో పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. కాగా ఇప్పటి వరకు తెలుగు నేల నుంచి ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయి లో పార్టీ పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరి కేసీఆర్ జాతీయ పార్టీ దేశ వ్యాప్తంగా ఏ మేరకు ప్రభావం చూపనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
- Tags
- NTR