- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. వాతావరణ శాఖ హెచ్చరిక
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అధిక వర్షాల కారణం రోడ్లపై నీరు నిలుస్లుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా, మరోసారి తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం, గురువారం, శుక్రవారం నాడు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఈ రోజు కూడా హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో వాన కురిసే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా బుధవారం నాడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గురు, శుక్ర వారాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.