Monkey Pox: తెలంగాణలో మంకీ పాక్స్ కేసులపై డీహెచ్ కీలక ప్రకటన

by Prasad Jukanti |   ( Updated:2024-08-24 13:39:41.0  )
Monkey Pox: తెలంగాణలో మంకీ పాక్స్ కేసులపై డీహెచ్ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా ప్రళయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాలను మంకీ పాక్స్ సవాలు విసురుతున్నది. ఈ వైరస్ విషయంలో ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించగా మంకీపాక్స్ కేసులు మన పొరుగు దేశాలలోనూ క్రమంగా పెరుగుతుండటం ఆదోళన కలిగిస్తున్న్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మంకీ పాక్స్ కేసులపై తెలంగాణ డీహెచ్ డా.రవీంద్ర నాయక్ కీలక ప్రకటన చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క మంకీ పాక్స్ కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు. మంకీ పాక్స్ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉన్నామని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంకీ పాక్స్ కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. వాతావరణంలోని మార్పుల కారణంగా దోమలతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, హెచ్ 1, ఎన్ 1 వంటి సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 4,600 డెంగీ కేసులు నమోదు అయ్యాయని 10 జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. హైదరాబాద్ జిల్లాలో 1,697 కేసులు నమోదు అయ్యాయని సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో అధికంగా డెంగీ కేసులు వచ్చాయని తెలిపారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు జిల్లాలోని అధికారులను సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటున్నామని ఇంటింటి సర్వే చేయడంతో పాటు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నామన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed