DK Aruna: ప్రధాని చొరవతో ఓరుగల్లుకు విమానాశ్రయం.. డీకే అరుణ ఆసక్తికర పోస్ట్

by Ramesh N |
DK Aruna: ప్రధాని చొరవతో ఓరుగల్లుకు విమానాశ్రయం.. డీకే అరుణ ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్‌ జిల్లా మామునూరు ఎయిర్​పోర్ట్ (Warangal Mamnoor Airport)​ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మామూనూరు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్‌కి కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (Aruna D.K) శనివారం ఎక్స్ ఖాతా ద్వారా ఆసక్తికర పోస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తూ.. ఓరుగల్లు వాసుల దశాబ్దాల కలను సాకారం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం వరంగల్‌లో నూతన విమానాశ్రయ ఏర్పాటుకు పూనుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున ప్రధాని నరేంద్ర మోడికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఆమె తెలియజేశారు.

వరంగల్ (Warangal) వాసుల కల సాకారం ప్రధాని చొరవతో ఓరుగల్లుకు విమానాశ్రయం అంటూ ట్వీట్ చేశారు. కాగా, వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్, బీజేపీ క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఎయిర్‌పోర్టు మంజూరు ఘనత తమదంటే తమదేనని పార్టీల నేతలు క్రెడిట్ పాలిటిక్స్‌కి తెరలేపారు.

Next Story

Most Viewed